ఉప్పరిగూడలో విషాదం.. విద్యుదాఘాతంతో ఐదేళ్ల చిన్నారి మృతి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఉప్పరిగూడలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కమ్యూనిటీ హాల్లో జరిగిన ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
Unidentified dead body


హైదరాబాద్ , 01 నవంబర్ (హి.స.)

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఉప్పరిగూడలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కమ్యూనిటీ హాల్లో జరిగిన ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. విద్యుత్ షాక్కు గురై చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కీసరకు చెందిన రాజశేఖర్ కుమార్తె వైశాలి (5) ఉప్పరిగూడలోని కమ్యూనిటీ హాల్ వద్ద ఉండగా ఈ ప్రమాదం జరిగింది. హాల్ పైభాగంలో ఏర్పాటు చేసిన విద్యుత్ లైటింగ్ను చిన్నారి తాకినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రవాహం ఆమెకు తగిలి తీవ్ర విద్యుదాఘాతానికి గురైంది. ఈ ఘటనతో అక్కడున్నవారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అప్పటివరకు ఆడుతూ కనిపించిన చిన్నారి ఒక్కసారిగా విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వైశాలి మృతితో కీసర ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande