ఈనెల 3న మరో విడత ఇందిరమ్మ ఫ్లాట్ల కేటాయింపునకు లాటరీ
ఇందిరమ్మ ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో విడత లాటరీ నిర్వహించేందుకు సిద్ధమైంది.
Telangana govt


హైదరాబాద్ , 01 నవంబర్ (హి.స.)

ఇందిరమ్మ ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో విడత లాటరీ నిర్వహించేందుకు సిద్ధమైంది. నవంబర్ 3వ తేదీన నాలుగు నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా తీయనున్నారు. ఇందులో భాగంగా ముషీరాబాద్, ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట, గోషామహల్ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఫ్లాట్లను లాటరీ పద్ధతిలో కేటాయించనున్నారు.

అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా ఫ్లాట్లు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను చేపడుతున్నారు. లాటరీ ద్వారా ఎంపికైన వారికి నిబంధనల ప్రకారం ఫ్లాట్ల కేటాయింపు చేపట్టనున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఫ్లాట్ల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారుల్లో ఆసక్తి నెలకొంది.

మరోవైపు, గతంలో నిర్వహించిన లాటరీల్లో కొన్ని కారణాలతో రద్దయిన ఫ్లాట్లకు కూడా ప్రభుత్వం తిరిగి కేటాయింపులు చేపట్టనుంది. మొత్తం 16 నియోజకవర్గాల్లో రద్దయిన ఫ్లాట్లకు నవంబర్ 4వ తేదీన మరోసారి లాటరీ నిర్వహించనున్నారు. ఈ రెండు విడతల ప్రక్రియ పూర్తయితే ఫ్లాట్ల కేటాయింపులో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. లబ్ధిదారులు లాటరీ ప్రక్రియకు సంబంధించిన అధికారిక సమాచారం, సూచనలను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande