అనకాపల్లి జిల్లాలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
అనకాపల్లి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
Vote


అనకాపల్లి , 01 నవంబర్ (హి.స.)

అనకాపల్లి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి జోన్లో ఆరు వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరోవైపు నర్సీపట్నం, ఎలమంచిలి పట్టణాల్లోనూ ఎన్నికల సందడి నెలకొంది. ఈ రెండు పట్టణాల్లో కలిపి మొత్తం 72 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.

నర్సీపట్నం మున్సిపాలిటీలో రెండు వార్డులు ఇప్పటికే ఏకగ్రీవం కావడంతో మిగిలిన స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మూడు పట్టణాలకు సంబంధించి మొత్తం 76 వార్డుల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా మూడు పట్టణాల్లో కలిపి 228 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

అనకాపల్లి జిల్లాలో మొత్తం 1,62,561 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన సిబ్బందిని నియమించి ఎన్నికల ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఓటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande