
అమరావతి , 01 నవంబర్ (హి.స.)
విజయవాడ 55వ డివిజన్ బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల గుర్తులు తారుమారమయ్యాయి. ఈ క్రమంలో గుర్తుల ముద్రణలో పొరపాటు సరిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. రెండు ప్రింటింగ్ ప్రెస్లలో ఏకకాలంలో బ్యాలెట్ పేపర్ల ముద్రణ ప్రక్రియ చేస్తున్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తికాగానే పోలింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. 55వ డివిజన్లో మొత్తం 8,881 మంది ఓటర్లు, 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్