ఖైదీలకు చట్టపరమైన హక్కులపై అవగాహన సదస్సు
జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి జి. అనూష మంగళవారం ఆసిఫాబాద్లోని ప్రత్యేక సబ్జైలును సందర్శించారు.
ఖైదీలకు అవగాహన


ఆసిఫాబాద్, 10 నవంబర్ (హి.స.)

జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి జి. అనూష మంగళవారం ఆసిఫాబాద్లోని ప్రత్యేక సబ్జైలును సందర్శించారు.

ఈ సందర్భంగా రిమాండ్, విచారణ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం, చట్టపరమైన హక్కులపై అవగాహన సదస్సు జరిగింది.

అనంతరం జైలు వంటగది, పరిశుభ్రత, ఖైదీలకు ఇస్తున్న ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమన్నారు. ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అర్హులైన ఖైదీలు చట్ట ప్రకారం బెయిల్ పొందే హక్కును వాడుకోవాలని సూచించారు. ఖైదీలు జైలు నిబంధనలు పాటిస్తూ, మంచి ప్రవర్తనతో జీవితంలో మార్పు తెచ్చుకుని సమాజంలో మంచి పౌరులుగా తిరిగి రావాలని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande