
గోదావరిఖని, 10 నవంబర్ (హి.స.)
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వార్షిక తనిఖీల్లో భాగంగా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్ కేంద్రం, రికార్డులు, సిబ్బంది బ్యారక్‌ను పరిశీలించారు. స్టేషన్లో 5ఎస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ పరిశుభ్రత పాటించాలని, రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు.
స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలు, రాత్రి గస్తీ, పెట్రోలింగ్‌పై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాపర్టీ నేరాలను అదుపులో పెట్టేందుకు ప్రత్యేక రాత్రి గస్తీ, ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు.
ఎన్టీపీసీ ప్రాంతం వ్యూహాత్మకంగా చాలా కీలకమైనందున భద్రత విషయంలో చిన్న నిర్లక్ష్యానికి కూడా అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. కీలక పారిశ్రామిక సంస్థలైన ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్కు పటిష్ట భద్రత కల్పించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు