
గోదావరిఖని, 11 నవంబర్ (హి.స.)
అక్రమంగా పేకాట ఆడినా, నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు మరోసారి హెచ్చరించారు.
గోదావరిఖనిలోని ఐబీ కాలనీలో ఉన్న వినాయక్ రెసిడెన్సీ లాడ్జిలో డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కలాట ఆడుతున్నారనే పక్కా సమాచారం అందడంతో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్, వన్ టౌన్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు.
టాస్క్ ఫోర్స్, నార్కోటిక్ ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ దీకొండ రమేష్ తో పాటు సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,36,130 నగదు, 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..