భారత్ సమ్మిట్ పేరుతో రాహుల్ గాంధీ రాజకీయ రీలాంచ్కు ప్రయత్నం: రాంచందర్రావు
భారత్ సమ్మిట్ నిర్వహణపై తెలంగాణ బీజేపీ నేత రాంచందర్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Ramchandar rao


హైదరాబాద్ , 11 నవంబర్ (హి.స.)

భారత్ సమ్మిట్ నిర్వహణపై తెలంగాణ బీజేపీ నేత రాంచందర్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ రాజకీయంగా తిరిగి పుంజుకునేందుకు మరోసారి రీలాంచ్ ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇందుకోసం తెలంగాణ ప్రజల సొమ్మును ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానాను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం సరికాదని హితవు పలికారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి హామీలు ఇచ్చినప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని రాంచందర్రావు విమర్శించారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తుండగా, రైతులకు రైతుబంధు సాయం కూడా సక్రమంగా అందడం లేదని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా రాజకీయ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటని నిలదీశారు.

తెలంగాణ ఖజానా గాంధీ కుటుంబ రాజకీయ పునరావాసానికి ఉపయోగపడే నిధి కాదని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ రాజకీయ ప్రతిష్ఠను పెంచేందుకు ప్రజాధనాన్ని వెచ్చించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాంచందర్రావు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande