
గోదావరిఖని, 11 నవంబర్ (హి.స.)
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ర్యాగింగ్, మాదకద్రవ్యాలు తీవ్ర అవరోధాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. రామగుండంలోని సిమ్స్ మెడికల్ కళాశాలలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన ర్యాగింగ్ వ్యతిరేక, మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడకుండా ఉండాలని, ఎవరైనా ర్యాగింగ్ కు గురైతే భయపడకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువు, లక్ష్యాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు