తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
రాష్ట్రంలో చలి రోజురోజుకూ ముదురుతోంది. మంగళవారం నిర్మల్ జిల్లా కుబీర్ లో అత్యల్పంగా 14.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, హైదరాబాద్ తో సహా మొత్తం 21 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల దిగువకు పడిపోయింది.
Cold


హైదరాబాద్, 11 నవంబర్ (హి.స.)

రాష్ట్రంలో చలి రోజురోజుకూ ముదురుతోంది. మంగళవారం నిర్మల్ జిల్లా కుబీర్ లో అత్యల్పంగా 14.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, హైదరాబాద్ తో సహా మొత్తం 21 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల దిగువకు పడిపోయింది.

సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో రాత్రి, తెల్లవారుజామున బయటకు రావడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రానున్న మూడు రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుంచి 12 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది.

దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande