అంగన్వాడీ కేంద్రాల పాల ధర పెంపు & రిలయన్స్ భారీ పెట్టుబడి ప్రతిపాదనలు
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పాల ధరను లీటరుకు రూ. 9 మేర పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Chandrababu Naidu


అమరావతి , 16 నవంబర్ (హి.స.)

రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పాల ధరను లీటరుకు రూ. 9 మేర పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 55,547 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 23.50 లక్షల మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంలో భాగంగా పాలు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) నుండి లీటరు రూ. 54.60 చొప్పున పాలు కొనుగోలు చేస్తుండగా, నిర్వహణ వ్యయం పెరిగినందున ధర పెంచాలని ఆ సంస్థ కోరింది. గత నెలలో రూ. 5 పెంపునకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినా కేఎంఎఫ్ అంగీకరించకపోవడంతో, తాజాగా రూ. 9 పెంపునకు సీఎం ఆమోదం తెలిపారు. దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ. 75 కోట్ల అదనపు భారం పడనుండగా, మొత్తం పాల సరఫరా వ్యయం రూ. 531 కోట్లకు చేరనుంది.

మరోవైపు, పారిశ్రామిక రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. భోగాపురం సమీపంలో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు, భూమిని తవ్వకుండానే బొగ్గును గ్యాస్గా మార్చే 'అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్' ప్రాజెక్టులో రూ. 43,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఏపీఈడీబీతో ఒప్పందం కుదుర్చుకోనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande