నేడు లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు అనుకూలించడం, చమురు ధరలు తగ్గడం మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచాయి.
Stock market


ముంబై, 19 నవంబర్ (హి.స.)

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు అనుకూలించడం, చమురు ధరలు తగ్గడం మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచాయి. విదేశీ మదుపర్ల పెట్టుబడులు స్థిరంగా కొనసాగడం కూడా సూచీలకు కలిసి వచ్చింది.

రోజంతా ఒడిదుడుకులతో సాగిన ట్రేడింగ్లో చివరి గంటలో కొనుగోళ్లు జోరందుకోవడంతో మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు గణనీయంగా పుంజుకున్నాయి.

ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 989.94 పాయింట్లు పెరిగి 83,021.75 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 286.35 పాయింట్లు లాభపడి 25,514.30 వద్ద ముగిసింది. చివరి గంటలో ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడంతో సూచీల లాభాలు మరింత పెరిగాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande