టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత
టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు (75) కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
Mla


చెన్నై, 19 నవంబర్ (హి.స.)

టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు (75) కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్తోనే ఆయన మరణించినట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నుంచి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) తరఫున పోటీ చేసిన వీఎస్ బాబు.. మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్పై 8,795 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది కాలానికే ఆయన మరణవార్త వెలువడటంతో రాజకీయ వర్గాల్లో విషాదం అలుముకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande