
న్యూఢిల్లీ,, 19 నవంబర్ (హి.స.)
ప్రపంచ వారసత్వ వారోత్సవాల (World Heritage Week) ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, గురువారం (నవంబర్ 19, 2026) దేశవ్యాప్తంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) పరిధిలోని స్మారక చిహ్నాలకు సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ప్రతి ఏటా నవంబర్ 19 నుండి 25 వరకు ప్రపంచ వారసత్వ వారోత్సవాలను నిర్వహిస్తారు.
భారతదేశ గొప్ప వారసత్వాన్ని సంబరంగా జరుపుకుందాం! 2026 నవంబర్ 19న ప్రపంచ వారసత్వ వారోత్సవాల సందర్భంగా అన్ని @ASIGoI స్మారక చిహ్నాలకు ఉచిత ప్రవేశం! మన అద్భుతమైన కట్టడాలను సందర్శించండి, మన వైభవోపేత గతం కథలను తెలుసుకోండి, భారత సాంస్కృతిక వారసత్వంలోని శాశ్వత వారసత్వాన్ని అనుభవించండి అంటూ పీఐబీ కల్చర్ (PIB Culture) తన 'ఎక్స్' (X) ఖాతాలో ప్రకటించింది.
కేవలం ఒక్క రోజే: ప్రస్తుతం ఈ టికెట్ మినహాయింపు నవంబర్ 19వ తేదీకి మాత్రమే వర్తిస్తుందని సదరు అధికారి స్పష్టం చేశారు.
ప్రధాన కట్టడాలు: దేశవ్యాప్తంగా ఏఎస్ఐ 3,800కు పైగా స్మారక చిహ్నాలు, ప్రదేశాలను పరిరక్షిస్తోంది. వీటిలో 143 టికెట్ ఉన్న ప్రదేశాలు కాగా.. ఆగ్రాలోని తాజ్ మహల్, ఢిల్లీలోని ఎర్రకోట, కుతుబ్ మినార్ వంటి ప్రముఖ కట్టడాలు ఈ జాబితాలో ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi