
న్యూఢిల్లీ, నవంబర్ 22(హి.స): గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు ప్రధాని మోదీ ‘ఎక్స్’ (X) వేదికగా సంతాపం తెలుపుతూ, గుజరాత్‌లోని కచ్, రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం జరగడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ కష్ట సమయంలో నా ఆలోచనలు బాధిత కుటుంబాలతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తాం. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 ఆర్థిక సాయం అందిస్తాం అని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi