రేపు గుంటూరులో కార్తిక దీపోత్సవం.. నేటి నుంచే ఉచిత పాస్ల పంపిణీ
గుంటూరు నగరంలో కార్తిక మాసాన్ని పురస్కరించుకుని రేపు సాయంత్రం ఘనంగా కార్తిక దీపోత్సవం నిర్వహించనున్నారు.
Koti DEEPOTSAQAM


గుంటూరు, 23 నవంబర్ (హి.స.)

గుంటూరు నగరంలో కార్తిక మాసాన్ని పురస్కరించుకుని రేపు సాయంత్రం ఘనంగా కార్తిక దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

దీపోత్సవంలో పాల్గొనాలనుకునే భక్తుల కోసం ఉచితంగా ప్రవేశ పాస్లను పంపిణీ చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి జీటీ రోడ్డులోని మైత్రి మాల్ పక్కన ఉన్న జ్యోతిర్మయి ప్రాపర్టీస్ మైదానంలో పాస్లు అందుబాటులో ఉంటాయి. పాస్ల సంఖ్య పరిమితంగా ఉండటంతో ముందుగా వచ్చేవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

రేపు సాయంత్రం 5 గంటలకు దీపోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. శ్రీనివాసరావుపేటలోని జీటీ రోడ్డులో ఉన్న జ్యోతిర్మయి ప్రాపర్టీస్ మైదానం ఈ వేడుకకు వేదిక కానుంది.

కార్తిక మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యత ఉండటంతో ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. పాస్లు పొందాలనుకునే వారు నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande