
కరీంనగర్, 24 నవంబర్(హి.స)
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వేలాది మంది అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఎట్టకేలకు ఊరట లభించనుంది. అసలు అగ్రిగోల్డ్ బాండ్లు, నగదు రసీదుల ధృవీకరణ ప్రక్రియను నవంబర్ 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నట్లు తెలంగాణ సీఐడీ ప్రకటించింది.
ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధితుల కోసం కరీంనగర్ లో ప్రత్యేక వెరిఫికేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన బాధితులు ఈ కేంద్రంలో తమ బాండ్లను వెరిఫై చేయించుకోవచ్చు. కరీంనగర్-సిరిసిల్ల బైపాస్ రోడ్డులోని అల్కాపురి కాలనీ, డీర్ పార్క్ పక్కన, ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో ఉన్న సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (సీటీసీ)లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
నవంబర్ 25, 2026 నుంచి ఫిబ్రవరి 2, 2027 వరకు మండలాల వారీగా దశలవారీగా వెరిఫికేషన్ జరగనుంది. పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి రోజు గరిష్టంగా 250 ఖాతాలను మాత్రమే పరిశీలిస్తారు.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు