
కాకినాడ , 24 నవంబర్ (హి.స.)
కాకినాడ జిల్లాలో ఏడుగురు మత్స్యకారులతో సముద్రంలోకి వెళ్లిన బోటు గల్లంతు కావడం కలకలం రేపుతోంది. యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేటకు చెందిన మత్స్యకారులు ఈ నెల 11న బోటులో సముద్రంలో చేపల వేటకు బయలుదేరారు. మొదట్లో అంతా సజావుగానే సాగినప్పటికీ, ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 14వ తేదీ వరకు తమ కుటుంబసభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఆ తర్వాత వారి ఫోన్లు అందుబాటులోకి రాకపోవడంతో కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. దాదాపు పది రోజులుగా వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో బోటుకు ఏమైందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
సముద్రంలో వేటకు వెళ్లిన తమవారు క్షేమంగా తిరిగి రావాలని కుటుంబసభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గల్లంతైన బోటు, అందులో ఉన్న ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనతో సుబ్బంపేటలో విషాద వాతావరణం నెలకొంది. మత్స్యకారుల జాడ తెలియకపోవడంతో స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్