విద్యుదాఘాతంతో దంపతులు మృతి.. తీపలపూడిలో విషాదం
తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నీటి మోటారు ఆన్ చేసేందుకు ప్రయత్నించిన దంపతులు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు.
Unidentified dead body


తిరుపతి , 24 నవంబర్ (హి.స.)

తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నీటి మోటారు ఆన్ చేసేందుకు ప్రయత్నించిన దంపతులు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వాకాడు మండలం తీపలపూడి గ్రామంలో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. తీపలపూడికి చెందిన ఈదూరు కుమార్ (40), ఆయన భార్య పుష్పలత (38) నీటి మోటారు వేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరా కారణంగా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. దంపతులను కాపాడేందుకు ప్రయత్నించే అవకాశం కూడా లేకుండా ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఒకేసారి భార్యాభర్తలు మృత్యువాత పడటంతో వారి కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. గ్రామస్థులు కూడా ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యారు. విద్యుత్ పరికరాలను వినియోగించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదం మరోసారి గుర్తుచేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande