వైరా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి
ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైరా సమీపంలోని గ్రీన్ఫీల్డ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు.
Accident


ఖమ్మం, 24 నవంబర్ (హి.స.)ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైరా సమీపంలోని గ్రీన్ఫీల్డ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో వారి కుమారుడు తీవ్రంగా గాయపడటంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్కు చెందిన కిషోర్రెడ్డి, లావణ్య దంపతులు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్లారు. స్వామివారి దర్శనం ముగించుకుని తిరిగి స్వస్థలానికి ప్రయాణమవుతుండగా వైరా సమీపంలోని గ్రీన్ఫీల్డ్ హైవేపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. వారితో పాటు ప్రయాణిస్తున్న కుమారుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. మృతులను హైదరాబాద్కు చెందిన కిషోర్రెడ్డి, లావణ్యగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

దైవదర్శనం కోసం వెళ్లి తిరుగు ప్రయాణంలో దంపతులు మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande