ధర్మవరం మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్గా విజయలక్ష్మి ఏకగ్రీవ ఎన్నిక
శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం మున్సిపాలిటీ వైస్ ఛైర్పర్సన్ పదవిని జనసేన పార్టీ కైవసం చేసుకుంది. ఈ పదవికి జనసేన తరఫున బరిలో నిలిచిన విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ధర్మవరం మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్గా విజయలక్ష్మి ఏకగ్రీవ ఎన్నిక


ధర్మవరం , 24 నవంబర్ (హి.స.)

శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం మున్సిపాలిటీ వైస్ ఛైర్పర్సన్ పదవిని జనసేన పార్టీ కైవసం చేసుకుంది. ఈ పదవికి జనసేన తరఫున బరిలో నిలిచిన విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ధర్మవరం మున్సిపాలిటీలో జనసేన పార్టీకి మరో కీలక పదవి దక్కినట్లయింది.

వైస్ ఛైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియలో విజయలక్ష్మి పేరుపై ఏకాభిప్రాయం కుదరడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నిక అధికారికంగా ఖరారు కావడంతో జనసేన శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయలక్ష్మికి అభినందనలు తెలియజేస్తున్నారు.

మున్సిపాలిటీలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై కొత్త వైస్ ఛైర్పర్సన్ దృష్టి సారించాల్సి ఉంటుంది. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. విజయలక్ష్మి ఏకగ్రీవ ఎన్నికతో ధర్మవరం రాజకీయాల్లో జనసేనకు ప్రాధాన్యం లభించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande