ఆదిలాబాద్లో నకిలీ నోట్ల ముఠా అరెస్టు
ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ కరెన్సీని తయారు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
Arrest


ఆదిలాబాద్ , 24 నవంబర్ (హి.స.)ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ కరెన్సీని తయారు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో నకిలీ నోట్లను ముద్రించి వాటిని చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

నకిలీ నోట్ల తయారీ, వాటి వినియోగం ద్వారా కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ముఠా కార్యకలాపాలపై దృష్టి సారించారు. విచారణలో చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో నకిలీ కరెన్సీని ముద్రిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనంతరం పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నకిలీ నోట్లను ఎక్కడ తయారు చేస్తున్నారు? వాటిని ఎవరెవరికి పంపిణీ చేస్తున్నారు? ఇప్పటివరకు ఎంత మొత్తంలో నకిలీ కరెన్సీని చెలామణిలోకి తీసుకొచ్చారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రజలు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి అనుమానాస్పద నోట్లను స్వీకరించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande