గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ఏర్పాట్లను ప్రభుత్వం వేగవంతం చేసింది.
MINISTER SRIDHAR babu


హైదరాబాద్ , 24 నవంబర్ (హి.స.)

తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ఏర్పాట్లను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు భారత్ ఫ్యూచర్ సిటీలో క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సమ్మిట్ నిర్వహణకు సిద్ధం చేస్తున్న ప్రధాన వేదిక, ఎక్స్పో జోన్తో పాటు ఇతర సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రధానంగా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, రవాణా సౌకర్యాలు, అతిథుల రాకపోకలకు అవసరమైన కనెక్టివిటీ, వసతి సదుపాయాలపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఈ సదస్సు ద్వారా తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు మరింత పెరిగేలా ప్రతి అంశాన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏర్పాట్లలో చిన్నపాటి నిర్లక్ష్యానికి కూడా తావివ్వకూడదని స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్ను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ఈ పర్యటన ద్వారా స్పష్టమవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande