జీవోలో నీటి వనరు వివరాలు లేవు.. రేవంత్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: హరీశ్రావు
పల్నాడు తాగునీటి పథకానికి సంబంధించి సీఎం రేవంత్రెడ్డి చూపించిన జీవోలో నీటిని ఎక్కడి నుంచి తీసుకుంటారనే విషయాన్ని స్పష్టంగా పేర్కొనలేదని బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు.
harish rao


పల్నాడు , 24 నవంబర్ (హి.స.)

పల్నాడు తాగునీటి పథకానికి సంబంధించి సీఎం రేవంత్రెడ్డి చూపించిన జీవోలో నీటిని ఎక్కడి నుంచి తీసుకుంటారనే విషయాన్ని స్పష్టంగా పేర్కొనలేదని బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. ఈ అంశంపై రేవంత్రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ హయాంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో నాగార్జునసాగర్ నుంచే పల్నాడుకు నీటిని తరలిస్తామని ఉందని హరీశ్రావు గుర్తుచేశారు. అయితే పల్నాడు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ను నిలిపివేస్తామని రేవంత్రెడ్డి ఎక్కడా స్పష్టంగా చెప్పలేదని అన్నారు. తాజాగా జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలోనూ ఈ పథకంపై తెలంగాణ ఇంజినీర్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు.

మరోవైపు రేవంత్రెడ్డి ప్రస్తావించిన జీవో నంబర్ కూడా తప్పుగా ఉందని హరీశ్రావు ఆరోపించారు. సంబంధిత జీవోలో ఒంగోలు బ్రాంచ్ కెనాల్ అని పేర్కొంటే, సీఎం మాత్రం నాగార్జునసాగర్ కెనాల్గా వివరించారని తెలిపారు. జీవోలోని అంశాలను పూర్తిగా చదవకుండా సగం సమాచారంతో ప్రజలకు తప్పుడు వివరాలు అందిస్తున్నారని విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande