ప్రకాశం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం.. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
ప్రకాశం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.
Rain


ప్రకాశం , 24 నవంబర్ (హి.స.)

ప్రకాశం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఒంగోలు, నాగులుప్పలపాడు, సంతనూతలపాడు మండలాల్లో వర్షాలు పడుతుండటంతో జనజీవనం కొంతమేర ప్రభావితమైంది. రాత్రి ప్రారంభమైన వర్షం ఉదయం వరకు కొనసాగడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా నాగులుప్పలపాడు మండలంలో వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మండల పరిధిలోని పలు గ్రామాల్లో రాత్రి నుంచి కరెంటు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. విద్యుత్ ఆధారిత పనులు నిలిచిపోవడంతో పాటు తాగునీటి సరఫరాపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. రాత్రంతా విద్యుత్ లేకపోవడంతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు వర్షం ఇంకా కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ అధికారులు సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాల్సి ఉంది. వర్షాల తీవ్రత, విద్యుత్ అంతరాయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande