
బాపట్ల , 24 నవంబర్ (హి.స.)
బాపట్ల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రేపల్లె మండలం మోర్తోట సమీపంలో కృష్ణా నదిలో మునిగి 18 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పుణ్యస్నానం కోసం నదిలోకి దిగిన గణేష్ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు.
మోర్తోటలోని శివాలయం వద్ద ఈ ఘటన జరిగింది. గణేష్ నదిలో స్నానం చేసేందుకు వెళ్లి నీటిలోకి దిగిన సమయంలో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. నదిలో మునిగిపోతున్న అతడిని గుర్తించేలోపే పరిస్థితి విషమించింది. చివరకు గణేష్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
చిన్న వయసులోనే యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పుణ్యస్నానం కోసం వెళ్లిన వ్యక్తి విగతజీవిగా తిరిగిరావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో మోర్తోట గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్