
అమరావతి , 24 నవంబర్ (హి.స.)
భోగాపురం సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతిపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం కారణంగా కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని హోంమంత్రి పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్