నేపాల్లో 5.3 తీవ్రతతో భూకంపం.. భారత్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు
నేపాల్లో 5.3 తీవ్రతతో భూకంపం.. భారత్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు
Earthquake of magnitude 2.6 jolts Ahmedabad at 4.39 am


నేపాల్‌, 24 నవంబర్ (హి.స.)

నేపాల్‌లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. ఉదయం సుమారు 7:02 గంటల సమయంలో నేపాల్‌లోని కోషి ప్రావిన్స్, తప్లేజుంగ్ జిల్లా పరిధిలో సిక్కిం సరిహద్దుకు సమీపంలో ఈ భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) మరియు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించాయి. భూమికి 10 నుంచి 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ భూకంపం ధాటికి భారత్‌లోని సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర బెంగాల్ జిల్లాలైన డార్జిలింగ్, జల్పైగురి, కూచ్ బెహార్‌తో పాటు బీహార్, మేఘాలయ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉదయం వేళ ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్, భారత్‌తో పాటు భూటాన్, బంగ్లాదేశ్, చైనాలోని సరిహద్దు ప్రాంతాల్లోనూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. అయితే, ఇప్పటివరకు ఎక్కడా ఆస్తి లేదా ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. స్థానిక యంత్రాంగం ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande