తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు 4 గంటల్లో సర్వదర్శనం
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రస్తుతం దర్శన సమయం కొంత తగ్గింది.
Ttd


తిరుమల, 24 నవంబర్ (హి.స.)

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రస్తుతం దర్శన సమయం కొంత తగ్గింది. టోకెన్లు లేకుండా సర్వదర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం కలగడానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు తిరుమలలో భక్తుల రాకపోకలు కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే మొత్తం 75,640 మంది భక్తులు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిపై భక్తితో 23,439 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల రూపంలో శ్రీవారి ఆలయానికి రూ.4.13 కోట్ల ఆదాయం లభించింది.

దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, ఇతర సౌకర్యాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande