భక్తుల భద్రతకు టీటీడీ కీలక నిర్ణయం.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల బీమా
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అమలు చేస్తున్న ‘శ్రీవారి యాత్ర సురక్ష’ పథకంపై పద్మావతి అతిథిగృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Ttd


తిరుమల , 24 నవంబర్ (హి.స.)

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అమలు చేస్తున్న ‘శ్రీవారి యాత్ర సురక్ష’ పథకంపై పద్మావతి అతిథిగృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి, ఈవో ముద్దాడ రవిచంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎల్ఐసీ ఛైర్మన్ దొరైస్వామి హాజరయ్యారు.

ఈ సందర్భంగా దొరైస్వామి మాట్లాడుతూ టీటీడీతో ఎల్ఐసీ భాగస్వామ్యం కావడం సంతోషకరమని అన్నారు. యాత్ర సమయంలో భక్తులకు ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ పథకం కింద యాత్రలో మరణించిన భక్తుల కుటుంబాలకు రూ.2 లక్షల బీమా పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు.

భక్తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి బీమా సదుపాయాన్ని శబరిమల ఆలయంలోనూ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశం అనంతరం ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు టీటీడీ ఈవో, అదనపు ఈవో, ఎల్ఐసీ ఛైర్మన్ కలిసి బీమా పరిహారాన్ని అందజేశారు. ఈ పథకం యాత్రికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande