ఉమ్మడి కుటుంబాలు తగ్గడంతో యువత డ్రగ్స్కు బానిసలవుతున్నారు: కిషన్రెడ్డి
దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా కనుమరుగవుతుండటం యువతపై ప్రభావం చూపుతోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు.
Kishan Reddy


హైదరాబాద్ , 24 నవంబర్ (హి.స.)

దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా కనుమరుగవుతుండటం యువతపై ప్రభావం చూపుతోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యుల మధ్య పర్యవేక్షణ, మార్గదర్శకత్వం తగ్గిపోవడంతో కొందరు యువత చెడు అలవాట్లకు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుకు తీవ్ర ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో యువత తమకు నచ్చిన విధంగా స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటున్నారని కిషన్రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో గమనించడం, నియంత్రించడం కష్టంగా మారుతోందని అభిప్రాయపడ్డారు. కుటుంబాల్లో పెద్దల పర్యవేక్షణ తగ్గడం కూడా యువతపై ప్రభావం చూపే అంశాల్లో ఒకటిగా పేర్కొన్నారు.

యువతలో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్య తీవ్రతను అంచనా వేసేందుకు సమాచారం సేకరిస్తున్నట్లు వెల్లడించారు. మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించినట్లు తెలిపారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. యువత ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకునేలా సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande