మూఢనమ్మకాలు, గంజాయి అక్రమ రవాణా పై పోలీసుల అవగాహన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని దురదపాడు గ్రామంలో బుధవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
Police


భద్రాద్రి కొత్తగూడెం, 25 నవంబర్ (హి.స.)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని దురదపాడు గ్రామంలో బుధవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని దురదపాడు గ్రామంలో బుధవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గండుగులపల్లి గ్రామ పంచాయతీకి చెందిన ఈ గ్రామంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా అశ్వారావుపేట పోలీసులు గ్రామస్తులతో మాట్లాడారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, గంజాయి అక్రమ రవాణా, మూఢనమ్మకాలు, కోడిపందేలు, పేకాట వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. అలాగే రహదారి భద్రత, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.

కార్డెన్ సెర్చ్ లో భాగంగా మొత్తం 101 ఇళ్లను తనిఖీ చేశారు. 67 బైక్ లు, 5 ప్యాసింజర్ ఆటోలు, 2 ట్రాక్టర్లు, ఒక బొలెరో వాహనాల పత్రాలను పరిశీలించి ధృవీకరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande