తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న ఆయన స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
Bhatti vikramarka


తిరుమల, 25 నవంబర్ (హి.స.)తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న ఆయన స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలపై శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.

తెలుగు ప్రజలందరికీ భగవంతుడి ఆశీస్సులు లభించాలని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి తిరుమల పర్యటన సందర్భంగా ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. భట్టి విక్రమార్క శ్రీవారిని దర్శించుకోవడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande