
హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.)
ప్రతి మహిళ, బాలిక భయం, వివక్ష, హింస లేని వాతావరణంలో జీవించాలని గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు.
వారికి గౌరవం, భద్రత, సమాన అవకాశాలు దక్కేలా సురక్షిత, సమానత్వ సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు.
మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా బుధవారం సోషల్ మీడియా ద్వారా ఆయన సందేశం ఇచ్చారు.
మహిళలపై హింస, వివక్షను పూర్తిగా తుడిచేయడానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. హింసకు గురైన బాధితులకు సమాజం అండగా నిలవాలని, నేరాలకు పాల్పడిన వారిని బాధ్యులను చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు