యువత భవిష్యత్తును కాపాడుకోవడం సమాజ బాధ్యత.. నటుడు వెంకటేష్
భారతదేశానికి అతిపెద్ద బలం యువతేనని, దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని సినీ నటుడు విక్టరీ వెంకటేష్ అన్నారు.
Hero Venkatesh


హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.)

భారతదేశానికి అతిపెద్ద బలం యువతేనని, దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని సినీ నటుడు విక్టరీ వెంకటేష్ అన్నారు.

యువతకు చదువు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు అందించడంతో పాటు వారి భవిష్యత్తును కాపాడుకోవడం సమాజం బాధ్యత అని పేర్కొన్నారు.

పిల్లలను డ్రగ్స్ వ్యసనాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. 2029 నాటికి డ్రగ్స్ లేని భారత్ ను నిర్మించాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. మాదకద్రవ్యాలు వాడటం వల్ల చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు.

జీవితం చాలా విలువైందని, క్షణికమైన వ్యసనాలకు లొంగి భవిష్యత్తును పాడుచేసుకోవద్దని యువతకు సూచించారు. డ్రగ్స్ కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. నో టు డ్రగ్స్.. ఎస్ టు లైఫ్ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని సందేశం ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande