నెల్లూరులో భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం
నెల్లూరు నగరంలోని గణేష్ ఘాట్ వద్ద కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
Koti DEEPOTSAQAM


నెల్లూరు, 25 నవంబర్ (హి.స.)

నెల్లూరు నగరంలోని గణేష్ ఘాట్ వద్ద కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్తీక మాసం సందర్భంగా ఘాట్ పరిసరాలు దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా కాశీ నుంచి వచ్చిన వేద పండితులు సంప్రదాయబద్ధంగా గంగా హారతి నిర్వహించారు. వేలాదిగా హాజరైన భక్తులు భక్తిపారవశ్యంతో హారతి కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం భక్తులు పవిత్రమైన కార్తీక దీపాలను వెలిగించి గణేష్ ఘాట్లో వదిలారు. దీంతో ఘాట్ పరిసరాలు దీపాల వెలుగులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ వేడుకకు విశాఖపట్నానికి చెందిన రమానంద భారతీస్వామి, స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ప్రముఖ దేవస్థానాల ప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తి, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగిన ఈ దీపోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande