కూకట్పల్లి ట్రక్ పార్క్ వేలంపై కేటీఆర్ ఆగ్రహం
కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
Ktr


హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.)

కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఈ నెల 27న జరగాల్సిన వేలాన్ని ఆపాలని, ప్రజా అవసరాల కోసం ఉన్న భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు.

వేలాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన నేతలను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో సహా అఖిలపక్ష నాయకులను పోలీసులతో అణచివేయడం సిగ్గుచేటని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని విమర్శించారు.

. నగర అవసరాలకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ భూములను వేలం వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని ఆరోపించారు. ప్రభుత్వ భూములు ప్రజల సొమ్మని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

--

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande