తిరుమలలో విషాదం.. గుండెపోటుతో భక్తుడి మృతి
తిరుమల పుణ్యక్షేత్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
Unidentified dead body


తిరుమల , 25 నవంబర్ (హి.స.)తిరుమల పుణ్యక్షేత్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. తిరుమలలోని రాంబగీచా బస్టాండ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని తమిళనాడులోని తంజావూరుకు చెందిన వాయల్రాజ్ (55)గా అధికారులు గుర్తించారు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. రాంబగీచా బస్టాండ్ పరిసరాల్లో ఉన్న సమయంలో వాయల్రాజ్కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు విషాద వాతావరణం నెలకొంది.

సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. అనంతరం వాయల్రాజ్ మృతి విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన వ్యక్తి ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన భక్తుల్లోనూ ఆవేదన కలిగించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande