బాసరలో భారీ అగ్నిప్రమాదం.. కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షల నగదు, బంగారం అగ్నికి ఆహుతి
బాసరలో భారీ అగ్నిప్రమాదం.. కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షల నగదు, బంగారం అగ్నికి ఆహుతి
fire


నిర్మల్/బాసర, నవంబర్ 25: (హి.స.)

నిర్మల్ జిల్లా బాసరలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రవీంద్రపూర్ కాలనీలోని ఒక నివాసంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లోని కుటుంబ సభ్యులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఇంట్లో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.10 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం, వెండి ఆభరణాలతో పాటు విలువైన పత్రాలు, గృహోపకరణాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ముఖ్యంగా తమ కుమార్తె వివాహం కోసం సిద్ధం చేసుకున్న ఫర్నిచర్, నూతన వస్త్రాలు అగ్నికి ఆహుతి కావడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande