
మహబూబాబాద్, 25 నవంబర్ (హి.స.)
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ బుధవారం గార్ల మండలంలో పర్యటించారు. గోపాలపురంలో జరుగుతున్న భూముల రీ సర్వే, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అక్కడ రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రైతులకు ముందే సమాచారం ఇచ్చిన తర్వాతే సర్వే కొనసాగించాలని స్పష్టం చేశారు.
రీ సర్వేను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో రెవెన్యూ, సర్వే ల్యాండ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు