రేపు హైదరాబాద్లో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు - నవంబర్ 26న - రాజధానిలో కాంగ్రెస్ భారీ మార్చ్ చేపట్టబోతోంది.
Minister


హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.)

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు - నవంబర్ 26న - రాజధానిలో కాంగ్రెస్ భారీ మార్చ్ చేపట్టబోతోంది. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఉదయం 10.30 గంటలకు ట్యాంక్బండ్ వద్ద లిబర్టీలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ర్యాలీ బయలుదేరి, నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ముగుస్తుంది.

ఈ మార్చ్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి సందీప్ కుమార్తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొననున్నారు.

కేవలం పార్టీ కార్యక్రమంగా కాకుండా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యతగా దీన్ని చూడాలని పొన్నం కోరారు.

అందుకే కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి మార్చ్ను విజయవంతం చేయాలని, రాజ్యాంగ పరిరక్షణకు తమ సంఘీభావం తెలపాలని పొన్నం పిలుపునిచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande