
నాగర్ కర్నూల్, 25 నవంబర్ (హి.స.)
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నేడు అచ్చంపేటలో సభా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నల్లమల్ల ప్రాంత అభివృద్ధికి సీఎం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.
పర్యటనలో సీఎం మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారని వెల్లడించారు. ఆ ఆలయ నిర్మాణానికి రూ.100 కోట్లు, మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.25 కోట్లు, హరిత హోటల్ కోసం రూ.15 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
అచ్చంపేట సభలో సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు కొత్తగా మంజూరైన 3.50 లక్షల పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..