నిజామాబాద్ పై ప్రభుత్వం సవతి ప్రేమ.. ఎమ్మెల్యే సూర్యనారాయణ
మూడేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు.
MLA


నిజామాబాద్, 25 నవంబర్ (హి.స.)

మూడేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. తెలంగాణలో ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వని దుస్థితి నెలకొందని విమర్శించారు.

నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి కోసం ఇంతవరకు ఎలాంటి ప్రత్యేక నిధులు మంజూరు కాలేదని ఆయన ఆరోపించారు. ప్రజల అవసరాలు, నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనుల కోసం నిధులు ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.

అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం కొడంగల్, మధిర నియోజకవర్గాలతో పాటు నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకే వేల కోట్లు కేటాయిస్తోందని ధన్పాల్ విమర్శించారు. మిగతా ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తోందని అన్నారు. నిజామాబాద్ అర్బన్ కు ప్రత్యేక నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులకు సహకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande