నేరస్తులకు కోర్టులో శిక్ష పడేలా దర్యాప్తు చేయాలి.. జిల్లా ఎస్పీ మహేశ్ బి. గితే
నేరస్తులకు కోర్టులో శిక్ష పడేలా ప్రతి కేసును పకడ్బందీగా దర్యాప్తు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి. గితే పోలీస్ అధికారులను ఆదేశించారు.
Sp


రాజన్న సిరిసిల్ల, 25 నవంబర్ (హి.స.)

నేరస్తులకు కోర్టులో శిక్ష పడేలా ప్రతి కేసును పకడ్బందీగా దర్యాప్తు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి. గితే పోలీస్ అధికారులను ఆదేశించారు.

బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, స్టేషన్ రైటర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న ఎస్పీ, దర్యాప్తులో నాణ్యతే కీలకమని స్పష్టం చేశారు.

ముఖ్యంగా పోక్సో, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ, మహిళలపై నేరాలు, గంజాయి వంటి కేసుల్లో బలమైన సాక్ష్యాలు సేకరించి, ఆలస్యం లేకుండా విచారణ ముగించాలని సూచించారు.

ఫిర్యాదు తీసుకోవడం దగ్గరి నుంచి కేసు నమోదు, విచారణలో పాటించాల్సిన చట్టపరమైన నిబంధనలు, సాక్ష్యాల ప్రాధాన్యం, చార్జిషీట్ వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కె. ఝాన్సీ, రజినీకాంత్, విక్రాంత్ అధికారులకు అవగాహన కల్పించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande