పోలీసులు క్షేత్రస్థాయి అనుభవంతో పాటు వృత్తి నైపుణ్యాలు అలవర్చుకోవాలి.. కమిషనర్ అంబర్ కిషోర్
పోలీసు ఉద్యోగంలో రాణించాలంటే కేవలం శిక్షణ సరిపోదు, క్షేత్రస్థాయి అనుభవంతో పాటు వృత్తి నైపుణ్యాలు అలవర్చుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ట్రైనీ డీఎస్పీలకు సూచించారు.
Cp


రామగుండం, 25 నవంబర్ (హి.స.)

పోలీసు ఉద్యోగంలో రాణించాలంటే కేవలం శిక్షణ సరిపోదు, క్షేత్రస్థాయి అనుభవంతో పాటు వృత్తి నైపుణ్యాలు అలవర్చుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ట్రైనీ డీఎస్పీలకు సూచించారు.

డీఎస్పీ శిక్షణ పూర్తి చేసుకుని ప్రాక్టికల్ శిక్షణ కోసం రామగుండం కమిషనరేట్కు వచ్చిన నలుగురు ప్రొబేషనరీ డీఎస్పీలు - సీహెచ్. ఆది శేషు రెడ్డి, మహమ్మద్ తాజుద్దీన్, బి. ఐశ్వర్య, దుగ్గిరెడ్డి హరిప్రియ - బుధవారం సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ప్రాక్టికల్ శిక్షణలో స్టేషన్ నిర్వహణ, నేరాల దర్యాప్తు, శాంతిభద్రతలు, పోలీసు పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలను క్షుణ్ణంగా నేర్చుకోవాలని చెప్పారు. సీనియర్ అధికారుల నుంచి విధి నిర్వహణలో మెళకువలు తెలుసుకుని, ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తూ నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు.

ప్రజలతో మర్యాదగా వ్యవహరించి, వారి బాధలను సానుభూతితో విని, బాధితులకు త్వరగా న్యాయం అందించేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande