సంక్రాంతికి ఏపీకి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్
సంక్రాంతికి సొంతూరికి వెళ్లే ప్రయాణికుల కోసం రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది.
Special friends


హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.)

సంక్రాంతికి సొంతూరికి వెళ్లే ప్రయాణికుల కోసం రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది.

రైల్వేశాఖ వివరాల ప్రకారం, సికింద్రాబాద్-పార్వతీపురం ప్రత్యేక రైలు డిసెంబర్ 23 నుంచి జనవరి 27 వరకు ప్రతి బుధవారం నడుస్తుంది. చర్లపల్లి, నల్గొండ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం మీదుగా ఈ రైలు వెళ్తుంది.

చర్లపల్లి-నర్సాపూర్ మధ్య జనవరి 10, 12, 17, 19 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్, హైదరాబాద్-నర్సాపూర్ మధ్య కూడా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు వేయడం వల్ల ప్రయాణికుల రద్దీ తగ్గే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande