
హైదరాబాద్ , 27 నవంబర్ (హి.స.)
హైదరాబాద్లోని కూకట్పల్లి ట్రక్ యార్డు భూముల వేలానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ భూముల వేలం ప్రక్రియకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రక్ యార్డుకు చెందిన 3.15 ఎకరాల భూములను వేలం వేయాలన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో అధికారులు చేపట్టనున్న వేలం ప్రక్రియకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.
కూకట్పల్లి ట్రక్ యార్డు భూముల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సామాజిక కార్యకర్త కాంతారావు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ భూముల వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు వాటిని కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
దీంతో 3.15 ఎకరాల భూముల వేలానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నేడు వేలం నిర్వహించేందుకు అధికారులకు అవకాశం లభించింది. హైకోర్టు తీర్పుతో వేలం ప్రక్రియపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తాజాగా వెలువడిన తీర్పు నేపథ్యంలో భూముల వేలం నిర్వహణపై అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్