జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు


అమరావతి , 27 నవంబర్ (హి.స.)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అబద్ధాలు, అసత్యాలకు ప్యాంటు, చొక్కా వేస్తే అది జగన్మోహన్రెడ్డి అవుతారని ఘాటుగా వ్యాఖ్యానించారు. అవినీతి పత్రికలో టన్నుల కొద్దీ అసత్యాలను ప్రచురిస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో వైసీపీ చేస్తున్న విమర్శలకు మంత్రి స్పందించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిచిపోయాయని నిమ్మల స్పష్టం చేశారు. 2020లోనే ఈ ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్టే విధించిందని గుర్తుచేశారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్రెడ్డి కాదా అని ప్రశ్నించారు. ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జీటీ జరిమానా విధించిన సమయంలో కూడా వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని పేర్కొన్నారు.

రాయలసీమ లిఫ్ట్ విషయంలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పించడంలో జగన్ ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. రాయలసీమకు జగన్ చేసినంత నష్టం మరే ముఖ్యమంత్రీ చేయలేదని విమర్శించారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే రాయలసీమలో 80 శాతం ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిర్మితమయ్యాయని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande