నేడు రాజమహేంద్రవరంలో సీఎం చంద్రబాబు పర్యటన.. న్యాయ ఉత్సవంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు.
Chandrababu Naidu


రాజమహేంద్రవరం, 28 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి ఆయన నేరుగా రాజమహేంద్రవరం చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోని మంజీరా సరోవర్ ప్రీమియర్ హోటల్కు వెళ్లనున్నారు. జిల్లా న్యాయస్థానం 222 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.

రాజమహేంద్రవరం జిల్లా కోర్టు 1804లో ఏర్పాటుకాగా, న్యాయవాదుల బార్ అసోసియేషన్ స్థాపించి 131 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ చారిత్రక సందర్భాలను పురస్కరించుకుని రాష్ట్ర స్థాయిలో న్యాయ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ వేడుకకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సరసా వెంకటనారాయణ భట్టి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్తో పాటు పలువురు న్యాయమూర్తులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. న్యాయవ్యవస్థ చారిత్రక ప్రస్థానాన్ని గుర్తుచేసుకునే ఈ వేడుకకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande