రాజమహేంద్రవరంలో నేడు న్యాయ ఉత్సవం.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
చారిత్రక నగరం రాజమహేంద్రవరం మరో అరుదైన వేడుకకు వేదిక కానుంది. నగరంలోని జిల్లా న్యాయస్థానం ఏర్పాటై 222 సంవత్సరాలు, బార్ అసోసియేషన్ స్థాపించి 131 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం న్యాయ ఉత్సవాన్ని రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా నిర్వహించనున్నారు.
Court decision


రాజమహేంద్రవరం, 28 నవంబర్ (హి.స.)

చారిత్రక నగరం రాజమహేంద్రవరం మరో అరుదైన వేడుకకు వేదిక కానుంది. నగరంలోని జిల్లా న్యాయస్థానం ఏర్పాటై 222 సంవత్సరాలు, బార్ అసోసియేషన్ స్థాపించి 131 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం న్యాయ ఉత్సవాన్ని రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా నిర్వహించనున్నారు. న్యాయవ్యవస్థ చరిత్ర, ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ఈ వేడుకను ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

రాజమహేంద్రవరంలోని మంజీరా సరోవర్ హోటల్లో జరగనున్న ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పర్యవేక్షణలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సరసా వెంకటనారాయణ భట్టి పాల్గొననున్నారు. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్తో పాటు పలువురు న్యాయమూర్తులు, న్యాయరంగ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన జిల్లా న్యాయస్థానం ప్రస్థానాన్ని స్మరించుకోవడంతో పాటు న్యాయరంగంలో దాని సేవలను గుర్తుచేసుకునేందుకు ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande